Site icon NTV Telugu

RK Roja: పవన్ కళ్యాణ్కు ఓట్లేసింది సినిమా షూటింగులు చేసుకోవడానికా..?

Roja

Roja

RK Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీయే కూటమీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సూపర్ సిక్స్- సూపర్ హిట్ కాదు సూపర్ ప్లాప్ అది‌‌‌.. అబద్దాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించింది. చంద్రబాబు, పవన్ రెండేళ్ళ రాష్ట్ర సంపదను దోచుకుని ప్రజలకు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని పేర్కొనింది. మంత్రులు చూపించిన మెడికల్ కాలేజీల వీడియోలు ఫేక్ అని ఆర్కే రోజా విమర్శలు గుప్పించింది.

Read Also: PM Modi: మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోడీ

ఇక, సినిమా షూటింగులు చేసుకోవడానికి కాదు పవన్ కళ్యాణ్ కి ప్రజలు ఓట్లు వేసింది అని వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫైట్ లో తిరగడానికి కాదు పవన్ కు ఓట్లు‌ వేసింది.. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను జనసేనా అధినేత పట్టించుకోకుండా ఫ్యాకేజీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నాడని విమర్శించింది. బుర్ర ఉన్న యదవ ఎవడు మెడికల్ కాలేజీల విషయంలో మద్దతు ఇవ్వడు‌.. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం తల ఆడించాడని ఎద్దేవా చేసింది. ఇక, పవన్ కళ్యాణ్ కు ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు అని మాజీ మంత్రి రోజా తెలిపింది.

Read Also: Charlie Kirk: చార్లీ కిర్క్ హంతకుడు ఎలా దొరికాడు.. ఎఫ్‌బీఐ సాధించిందేమీ లేదా?

అయితే, మంత్రులు వస్తే మెడికల్ కాలేజీలు చూపిస్తామని ఆర్కే రోజా సూచించింది. హోంమంత్రి అనిత మెడికల్ కాలేజ్ విషయంలో చూపించింది ప్రజెంటేషన్ కాదు ఫ్రస్టేషన్ అన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు మెడికల్ కాలేజీల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొత్త పిచ్చోడో పొద్దెరగడు అన్నట్లుగా మంత్రి పదవి రాగానే సవిత పని చేస్తోంది.. నాలుగుసార్లు సీఎంగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ చంద్రబాబు కట్టలేదు.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడింది. మెడికల్ కాలేజీలను అనుమతులు ఎలా వస్తాయో కూడా మంత్రులకు తెలియదు.. లోకేష్, చంద్రబాబు మెప్పు కోసం సిగ్గులేకుండా మంత్రులు అబద్దాలు చేబుతున్నారు.. జగన్ బెంగుళూరులో ఉంటే టీడీపీ, జనసేన ఓడిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించింది.

Exit mobile version