AP Volunteers: ఏపీలో వాలంటీర్ల చేతివాటం.. ఎదురుతిరిగితే ఫించన్ తొలగిస్తామని బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Volunteers: ఏపీలో ప్రతినెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు వాలంటీర్లే ఇంటింటికీ వెళ్లి ఫించన్ ఇస్తున్నారు. అయితే కొందరు వాలంటీర్స్ అమాయకపు వ్యక్తులను మోసం చేస్తూ బాగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండలం కామన్ దొడ్డిలో వాలంటీర్లు చేతి వాటం ప్రదర్శించారు. నూతనంగా మంజూరైన ఫించన్ ఇచ్చినట్టే ఇచ్చి ఫోటోలు దిగి వాలంటీర్లు వెనక్కి తీసుకున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫించన్ రావడంతో బాధితులు కళ్ళల్లో ఆనందంకు అవధులు లేకుండా పోయింది. అయితే ఆ ఆనందం గంటలోపే నీరు కారి పోయింది. ఓ చేత్తో ఇచ్చి.. మరో చేత్తో వాలంటీర్లు ఇచ్చిన డబ్బులను లాక్కొని వెళ్ళారు. దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: MP Gorantla Madhav Live : నేను చెప్పింది చేస్తే రాజీనామా చేస్తా..!
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
అయితే కోసిగి మండలం కామన్ దొడ్డిలో వాలంటీర్లందరూ కుమ్మక్కై ఓ పాలసీని అమలు చేస్తున్నారు. నూతనంగా మంజూరైన మొదటి నెల ఫించన్‌ను రౌడీ మాములు ఇవ్వాల్సిందేనని వాలంటీర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ పాలసీని సీఎం జగన్ అమలు చేశారా లేదా వాలంటీర్లు అమలు చేశారా అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అక్కడ వాలంటీర్లు తామే సీఎం.. తామే ఎమ్మెల్యే.. తమకు ఎదురు తిరిగితే సంక్షేమ పథకాలు, ఫించన్ అందకుండా తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు వాలంటీర్లు తూట్లు పొడుస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇలాంటి వాలంటీర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!