Prabhas: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులకు నిన్నటితో ఒక పెద్ద పండుగ వచ్చేసింది. ఆదిపురుష్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయడంతో ప్రభాస్ ఫ్యాబ్స్ పండుగ చేసుకుంటున్నారు. ట్రోల్స్ ను పక్కన పెడితే ప్రభాస్ ను చూసిన ఆనందం చాలు అంటున్నారు. నిన్న అయోధ్యలో ప్రభాస్ సందడి చేసిన విషయం విదితమే. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో అందరి చూపు ప్రభాస్ కాలిపైనే ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. డైరెక్టర్ ఓం రౌత్, కృతి సనన్ చేయి పట్టుకొని డార్లింగ్ స్టేజి ఎక్కడం మీడియా కంట పాడడం, ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇక దీంతో ప్రభాస్ కు ఏమైంది అంటూ డార్లింగ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు విష్యం ఏంటంటే.. ఇటీవలే ప్రభాస్ అమెరికాకు వెళ్లి మోకాలి సర్జరీ చేయించుకున్నాడు ప్రభాస్. ఇంకా ఆ నొప్పి తగ్గలేదట. కృష్ణంరాజు మృతి తరువాత ఆ పనులన్నీ దగ్గర ఉండి చూసుకోవడంలో బిజీగా ఉండి కాలు గురించి పట్టించుకోకపోవడంతో మోకాలు నొప్పి మరోసారి తిరగబడిందంట. దీంతో మరోసారి మోకాలి నొప్పితో ప్రభాస్ బాధపడుతున్నారని అంటున్నారు. అందులోను అయోధ్యలో శ్రీరాముని టెంపుల్ కు నడిచివెళ్లడంతో ప్రభాస్ మోకాలు నిలబడడానికి కూడా సహకరించలేదని, అందుకే డార్లింగ్, మరొకరి చేయి సాయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ వార్త తెలియడంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ మోకాలి దెబ్బ.. బాహుబలి షూటింగ్ సమయంలో జరిగిందన్న విషయం విదితమే. మరి ప్రభాస్ పూర్తిగా కోలుకోని ఎప్పుడు నార్మల్ గా నడుస్తాడో చూడాలి.