రెవెన్యూ సదస్సుల నిర్వహణపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగా రాష్ట్రంలో విపరీతంగా భూ సంబంధ సమస్యలు పెరిగిపోయాయి.. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణంగా పేర్కొన్నారు..
ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయి.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పరిష్కారం కాని భూ సమస్యలను.. సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.