Vizianagaram: గుర్ల గ్రామంలో మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ..
- గుర్లలో మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ
- ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడిన సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే అసలు ఘటనకు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
Read Also: Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్‌ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది'
దీనిలో భాగంగా సీనియర్ ఐఎఎస్ అధికారి కె. విజయానంద్‌తో మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని సీఎం నిర్ణయించారు. మరణాలకు అసలు కారణం ఏంటీ, ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు ఏంటీ అనేది తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలని సీఎం భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని.. సమస్య పరిష్కారం అయ్యే వరకు తాగునీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే.. వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్లుఎస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ధైర్యం చెప్పి.. సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
Read Also: IND vs NZ: టాస్ ఓడిపోవడం వల్లే గెలిచాం..- కివీస్ కెప్టెన్
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..