Home Minister Anitha: అధికారులపై హోంమంత్రి అనిత సీరియస్.. చర్యలు తప్పవని వార్నింగ్..
- అధికారుల తీరుపై హోం మంత్రి వంగలపూడి అనిత ఫైర్..
- విజయనగరం డీఆర్సీ సమావేశానికి హాజరైన అనిత..
- ఏదో కాకి లెక్కలతో కాగితాల దొంతులుగా మాకిచ్చి వెళ్లిపోతున్నారు..
- ఆ పేపర్లు తర్వాత చెత్త బుట్టలోకి వెళ్లిపోతున్నాయి..
- పద్దతి మారకపోతే చర్యలు తప్పవని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విజయనగరం కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరైన ఆమె.. డీఆర్సీలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏదో కాకి లెక్కలతో కాగితాల దొంతులుగా ప్రెస్‌నోట్ మా కిచ్చి వెళ్లిపోతున్నారని ఫైర్ అయ్యారు.. కానీ, ఆ పేపర్లు తర్వాత చెత్త బుట్టలోకి వెళ్లిపోతున్నాయి.. అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు.. కానీ, ఇక ఇలాంటి పద్దతికి చెల్లు చీటు చెప్పండి… ఇక నుంచి ముందే కలెక్టర్ వద్ద గత డీఆర్సీలో ఏం చేశామో చర్చించండి.. ఎంత వరకు పూర్తి చేశామో ముందే బ్రీఫ్ చేసి పెట్టుకోండి అని ఆదేశించారు..
Read Also: AP Crime: ఎన్టీఆర్ జిల్లాలో మహిళ సూసైడ్ కలకలం.. సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యేకి వినతి..!
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
విజయనగరం వెనుకబడిన జిల్లా అంటారు.. ఎవ్వరన్నారు వెనుకబడిన జిల్లా అని… జిల్లాకి అన్ని వనరులు ఉన్నాయి.. వర్షపాతం అధికంగా ఉన్నాయి.. నీటి నిలువలు అధికంగా ఉన్నాయన్నారు హోంమంత్రి అనిత.. అధికారులు ఏం పని చేస్తున్నారో నాకు అర్ధం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ డీఆర్సీలో ప్రజాప్రతినిధులు ఏ సమస్యలు లేవనెత్తినా.. ఆ తర్వాత అది ఎంత మేర పరిష్కరించగలిగామో చెప్పాలి.. లేనిపక్షంలో కచ్చితంగా చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు.. ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. గతంలో హెవీ లోడ్స్ తో వెళ్లిన వాహనాలు ఎన్ని ఉన్నాయో ఆర్ అండ్ బీ, ఆర్టీవో సమన్వయంతో గుర్తించాలని అడిగా… కానీ, ఇంత వరకు ఎందుకు సమన్వయ సమావేశం పెట్టుకోలేదు? అని నిలదీశారు.. ఇలా అయితే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని ఆర్ అండ్ బీ అధికారులపై మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు..
తాజావార్తలు
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!