Kayadu Lohar: ఆషికా, ఆండ్రియా కాదు.. ‘తలా’ సరసన కయాదు లోహర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kayadu Lohar Likely to Join Ajith Dare Devilతమిళ స్టార్ హీరో, తలా అజిత్ అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. అజిత్ నటించబోయే 64వ సినిమాకు ‘డేర్ డెవిల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. దీంతో చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న తలా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
అజిత్ చివరిగా నటించిన సినిమా విడుదలై ఏడాదిన్నర దాటిపోయింది. ప్రస్తుతం ఆయన చేతిలో సినిమా లేదంటే మాత్రం కాదు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత మరోసారి దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌కే అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమాను అజిత్ 64గా ప్రకటించారు. అయితే నిర్మాతల విషయంలో సరైన క్లారిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ చాలాకాలంగా ఆలస్యమవుతూ వచ్చింది. మరోవైపు అజిత్ కార్ రేసింగ్‌తో బిజీగా ఉండటంతో సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందనే విషయంలో అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది.
Also Read
- Ramayana Song: "కాపీ కొట్టేశాడా..?".. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
- Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
- Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
- Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
ఈ సినిమాకు అజిత్ అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రాకపోవడంతో ఆయనే నిర్మాతగా మారారు. అయినప్పటికీ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ ఉండటంతో హీరోయిన్ శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కొత్త హీరోయిన్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. మొదట ఆషికా రంగనాథ్, ఆండ్రియా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఇద్దరిలో ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపిస్తోంది. శ్రీలీల స్థానంలో ఆమె దాదాపు ఖరారైనట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌కు సినిమాల్లో హీరోయిన్ పేరు విషయంలో ఓ ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. తన చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు ‘రమ్య’ అనే పేరు పెట్టడం ఆయనకు అలవాటు. మొదటి సినిమా ‘త్రిష ఇల్లానా నయనతార’ నుంచి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వరకు ఈ సెంటిమెంట్ కొనసాగింది. ఇప్పుడు అజిత్ 64గా తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’లో కూడా హీరోయిన్ పాత్ర పేరు రమ్యగానే ఉంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరి ఈ సినిమాలో రమ్య పాత్రను ఏ హీరోయిన్ పోషించనుంది?, కయాదు లోహర్ పేరు నిజంగానే ఖరారైందా? అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవంబర్ 2 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kayadu Lohar: ఆషికా, ఆండ్రియా కాదు.. ‘తలా’ సరసన కయాదు లోహర్!
-
Upcoming SUVs in India: 2026 చివరి నాటికి భారత్‌లోకి రానున్న 4 కొత్త SUVలు.. హోండా EV నుంచి మహీంద్రా వరకు!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవాలు.. పిడుగురాళ్ల, దర్శి పట్టణాల్లో కూటమి హవా!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!