Vangalapudi Anitha: టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత.. ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే వైసీపీ నుంచి సస్పెండ్ చేయండి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సలహా ఇచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు.. బొబ్బిలి పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఇంటింటికి వెళ్ళి ఏడాడి కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.. బొబ్బిలి రావువారి వీధిలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు..
Read Also: Minister Nara Lokesh: 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ.. పెట్టుబడులతో రండి..
భారతదేశం అంటే స్త్రీలను గౌరవించే దేశం.. ప్రపంచదేశాలలు భారతదేశాన్ని చూసి స్త్రీలను గౌరవిరస్తారు.. కానీ, వైసీపీ పార్టీ కోసం మాట్లాడడం మేం కూడా సిగ్గుపడుతున్నాం.. వైసీపీ నేతలు మహిళలను అగౌరవపరుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హోంమంత్రి అనిత.. తల్లి, చెల్లిన గౌరవించని నాయకుడు-ఒక నాయకుడా..? ఎమ్మెల్యేలకు అధ్యక్ష అనాలనే కోరిక ఉంటుంది.. అందులో మహిళా ఎమ్మెల్యేను మరింత గౌరవించాలి అని సూచించారు.. మహిళా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమారు రెడ్డి అలా మాట్లాడడం దుర్మార్గం అన్నారు.. ప్రసన్నకుమారు మాట్లాడిన విడియో మీ తల్లికి, మీ భార్యకు, మీ బిడ్డ దగ్గరకు వెళ్లి చూపించండి.. ప్రసన్నకుమారు రెడ్డి గతంలో నాపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత..
Read Also: Aishwarya Rajesh : నలుగురు కాదు .. ఆరుగురైనా నాకు ఓకే..
సజ్జల రామకృష్ణారెడ్డి మహిలను ఇటీవలే పిచాచీలు, సంకర జాతి అని మాట్లాడారు. ఆ పార్టీకి చెందిన మీడియా స్టూడియోలో వేష్యల అమరావతి అని మాట్లాడారు.. అమరావతి మహిళాలోకం తిరగబడిందన్నారు మంత్రి అనిత.. మీరు మాట్లాడుతున్నది ఒక ఆడబిడ్డ కోసం.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే అడుగుకునే పరిస్థితికి వచ్చారు.. గతంలో బోరుగోడ్డ అనిల్, శ్రీరెడ్డి, అంబటి లాంటి వారు ఎందరో ఇష్టానుసారంగా మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డికి రాజకీయం ముఖ్యమా? విలువలు ముఖ్యమా.? అని ప్రశ్నించారు.. ఈ రోజు రాజకీయాల్లో ఆడవాళ్ళు రావాలంటే భయపడుతున్నారు.. ఆ రోజు అసెంబ్లీలో భువనమ్మపై ఇష్టంవచ్చినట్టు మాట్లాడారు. సొంత తల్లి, చెల్లిని గౌరవించలేదు.. రోజువారి జీవనం సాగించేవారికి కూడా విలువలతో మాట్లాడుతారు.. కానీ, వీరికి మాత్రం మహిళలు అంటే గౌరం లేదని మండిపడ్డారు..
Read Also: Nitish Kumar: ఎన్నికల వేళ మహిళలపై నితీష్ వరాలు.. ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటన
ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు.. దమ్ము ఉంటే ఆ మహిళా ఎమ్మెల్యేను ఎదుర్కోండి అంటూ ప్రసన్నకుమార్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి అనిత.. దీనిపై జగన్ మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆమె.. గంజాయి బ్యాచ్ ని జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు.. కానీ, ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించరు అన్నారు.. వైసీపీ మహిళా నాయకులు ప్రసన్నకుమార్ రెడ్డి మాటలను హర్షిస్తారా? అని ప్రశ్నించారు.. వైసీపీలో మహిళలకు గౌరవం లేదు.. వెంటనే ప్రసన్న కుమార్ ను మీపార్టీ నుండి సస్పెండ్ చేయండి అని సూచించారు.. గతంలో అనంతబాబును కూడా ఏమీ చేయలేదని దుయ్యబట్టారు.. జగన్ మోహన్ రెడ్డి నేరప్రవృత్తి కోసం ప్రజలు ఆలోచించాలి. సోషల్ మీడియా వేదికగా ఇస్తానుసారంగా మాట్లాడుతున్నారు.. 11 సీట్లుకు వచ్చిన-సిగ్గురాలేదని ఫైర్ అయ్యారు.. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి.. ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. జగన్ బయటికి వచ్చి మాట్లాడాలి.. మహిళల గౌరవాన్ని జగన్ మోహన్ రెడ్డి కాపాడాలన్నారు.. గత ప్రభుత్వంలో పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీస్ శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చాం. గతంలో లాండ్ ఆర్డన్ ను గాలికివదిలేసారు. ఇప్పుడు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారి ఆస్తులను కూడా జప్తు చేసుకుంటున్నాం అని వెల్లడించారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత..