టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత.. ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే వైసీపీ నుంచి సస్పెండ్ చేయండి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సలహా ఇచ్చారు.
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కలకలం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సావిత్రి నగర్‌లోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలోకి చొరబడి దుండగులు.. అల్లకల్లోలం చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలకొట్టి దాన్ని తలకిందులుగా పక్కకి తోసేసారు. ఇంటి రూపు రేఖలే మార్చేశారు.