Minister Nara Lokesh: 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ.. పెట్టుబడులతో రండి..
- మరో 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ..
- పెట్టుబడులతో రండి.. ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం..
- జీసీసీ గ్లోబల్ లీడర్ల రోడ్‌షోలో మంత్రి లోకేష్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: మరో 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కాబుతోంది.. పెట్టుబడులతో రండి.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అంటూ జీసీసీ గ్లోబల్ లీడర్ల రోడ్‌షోలో పిలుపునిచ్చారు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.. దేశంలో పేరెన్నిగన్న దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిథులతో బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించిన లోకేష్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అన్నారు..
Read Also: Kollywood : ఓ వైపు డిజాస్టర్స్.. అయినా కూడా సీక్వెల్స్ పై స్టార్ హీరోల మోజు..
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
ఇక, టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో.. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో 5 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోందన్నారు మంత్రి లోకేష్.. ఇది భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు విశాఖ సిటీ ఐటీ హబ్‌గా తయారవుతోంది. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నాం. అంతేకాదు, దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు అందిస్తున్నామని వెల్లడించారు.. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా.. ఆహ్వానించారు మంత్రి లోకేష్.. ఈ రోడ్ షోలో లోవ్స్ ఇండియా ఎండీ అంకుర్ మిట్టల్, రోల్స్ రాయ్స్ వైస్ ప్రెసిడెంట్ హరిహరన్ గణేశన్, శాక్స్ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మధు నటేశన్, జేసీ పెన్నీ ఇండియా ఎండీ కౌశిక్ దాస్, లులూ లెమన్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ మైసూర్, డెల్టా ఎయిర్ లైన్స్ డైరక్టర్ సైఫ్ అహమ్మద్ షరీఫ్, విక్టోరియా సీక్రెట్ వైస్ ప్రెసిడెంట్ వసుధారిణి శ్రీనివాసన్, నసుని ఇండియా సీనియర్ డైరక్టర్ పెద్దరెడ్డెప్ప, ఎఎన్ జెసీఎఫ్ఓ కవితా రమేష్, ఆస్ట్రల్ ల్యాబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివానంద ఆర్. కోటేశ్వర్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ సీఈవో లలితా ఇంద్రకంటి, ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్.. తదితరలు పాల్గొన్నారు..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!