Vizag Police Bust Kidney Racket: విశాఖపట్నంలోని కిడ్నీ రాకెట్ కేసుని పోలీసులు ఛేధించింది. ఈ కేసుకి సంబంధించి ముగ్గురిని (ఇద్దరు డాక్టర్లు, ఒక దళారి) అరెస్ట్ చేశారు. కిడ్నీ అవసరం ఉన్న ఉన్నత వర్గాల వ్యక్తుల నుంచి భారీ డబ్బు వసూలు చేసి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని టార్గెట్ చేస్తూ.. ఈ ముఠా సభ్యులు కిడ్నీ రాకెట్ నడిపిస్తున్నారు. అయితే.. ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఆపరేషన్ చేసిన వైద్యులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కామరాజు లొంగిపోగా.. శ్రీ తిరుమల ఆసుపత్రి ఎండీ పరమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డాక్టర్ స్రవంత్, ఎలినాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Puducherry : తాగి వచ్చి కొడుతున్నాడని.. మొగుడిపై కిరోసిన్ పోసి నిప్పంటిన భార్య
విశాఖ నగరంలో కొంతకాలం నుంచి కిడ్నీల రాకెట్ గుట్టుగా సాగుతోంది. కిడ్నీలు ఫెయిల్ అయిన ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులకు.. కొందరు వైద్యులు కిడ్నీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వారికి డబ్బు ఆశ చూపించి, వారి వద్ద నుంచి కిడ్నీలు తీసుకొని, వాటిని కిడ్నీ అవసరం ఉన్న ఉన్నత వర్గాల వారికి భారీ మొత్తానికి అనధికారికంగా అమ్ముకుంటున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు లక్షలాది రూపాయలు ఇచ్చేందుకు ముందుకొస్తుండటంతో.. ఆయా ఆసుపత్రులు ఈ కిడ్నీ దందా షురూ చేశాయి. అయితే.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొందరు బాధితులకు డబ్బులు ఇవ్వలేదు. అదిగో, ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చారు. దీంతో.. తాము మోసపోయామని భావించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం బట్టబయలైంది. గతంలో నగర పరిధిలోని శ్రద్ధ ఆస్పత్రిపై ఆరోపణలు రాగా.. ఇప్పుడు తాజాగా పెందుర్తిలోని శ్రీతిరుమల ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ బయటపడింది.
China: వీగర్ ముస్లింలను రంజాన్ ప్రార్థనలకు కూడా అనుమతించని చైనా ప్రభుత్వం..
కాగా.. ఈ కిడ్నీ రాకెట్‌ను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ చేయాలంటూ వైద్య, ఆరోగ్య శాఖలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు విచారణ వేగవంతం చేశారు. పోలీసులు సైతం సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుమల ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆదేశించగా.. డీఎంహెచ్‌వో పెందుర్తి తహశీల్దార్ సమక్షంలో ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు. మానవ అవయవాల మార్పిడి చట్టం 1995 ఐసీసీ 18, 19 పాటు 420 ఆర్/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు.