కిడ్నీ రాకెట్ కేసులో వాస్తవాలు వెలుగు వస్తున్నాయి. దీంతో.. ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తుంది. కిడ్నీ మార్పిడి కేసులో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కీలక పాత్ర పోషించింది. కిడ్నీ మార్పిడి చేస్తామని అడ్వాన్స్ కింద పది లక్షలు వసులు చేసి.. డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది నిరాకరించింది. మొత్తం రూ. 27 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో.. మోసపోయామని తెలుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.