మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… జీవీఎంసీ ఉపఎన్నికల్లో అల్లిపురం దగ్గర ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుప్పంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది… ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.. ఫలితాల తర్వాత టీడీపీ తుడిచిపెట్టుకొని పోతుందని జోస్యం చెప్పిన సాయిరెడ్డి.. నారా లోకేష్ భాష అసభ్యంగా, తలవంపులు తెచ్చే విధంగా ఉందన్నారు.. టీడీపీకి భవిష్యత్ నాయకుడుగా ప్రాజెక్ట్ అవుతున్న వ్యక్తి తాను మాట్లాడే భాష తగునా అని ప్రశ్నించిన ఆయన.. జీవీఎంసీలో రెండు వార్డుల్లో వైసీపీ ఘన విజయం ఖాయం అన్నారు. ఇక, ఉప ఎన్నికల ఫలితాలు 2024నాటి వైసీపీ విజయానికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొన్నారు సాయిరెడ్డి.