YS Jagan Road show: విశాఖలో వైఎస్ జగన్ రోడ్‌షో..
- విశాఖపట్నంలో వైఎస జగన్ రోడ్ షో..
- ఎయిర్ పోర్ట్ నుంచి నర్సీపట్నంకు రోడ్డు మార్గాన జగన్..
- జగన్ కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు..
- వినతిపత్రం అందజేసిన న్యాయవాదులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Road show: విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగుతోంది.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన. ఇక, విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి నర్సీపట్నం రోడ్డు మార్గాన బయల్దేరారు.. పోలీసులు షరతుల మధ్య జగన్ టూర్ పై ఉత్కంఠ కొనసాగుతుండగా.. పోలీసులు నిర్దేశించిన పెందుర్తి., అనకాపల్లి మీదుగా మెడికల్ కాలేజ్ దగ్గరకు చేరుకోనున్నారు జగన్.. ఇక, కాకాని నగర్ దగ్గర వైఎస్ జగన్‌ను కలిశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. ఈ సందర్బంగా తమ సమస్యలపై జగన్‌కు వినతి పత్రం అందజేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.. 10 నిముషాలకు పైగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు జగన్.. స్టీల్ ప్లాంట్ పరిణామాలపై కార్మిక నేతల నుంచి సమాచారం తీసుకున్నారు మాజీ సీఎం..
Read Also: Minister Nara Lokesh: మనమంతా టీడీపీ కుటుంబ సభ్యులం.. ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం..
Also Read
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ఆ తర్వాత రోడ్ షోలో జగన్ ను కలిశారు న్యాయవాదులు.. తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.. అండగా ఉంటానని లాయర్లకు హామీ ఇచ్చారు.. మరోవైపు, వైఎస్ జగన్‌ను కలిసేందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు.. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు రాగా.. జి.భీమవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.. జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసుల అంటుండగా.. కలిసి తీరుతామని పట్టుబట్టారు మత్స్యకారులు. అయితే, వైఎస్ జగన్ రోడ్డు షోకు పెద్ద ఎత్తున తరలివచ్చారు వైసీపీ శ్రేణులు.. ఓవైపు పోలీసులు ఆంక్షలు ఉన్నా.. వాటిని లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో వచ్చి జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు.. ఇక, వారికి అభివాదం చేస్తూరోడ్‌లో ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..