Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News What Have Parties Done For Vangaveeti Ranga In 37 Years Asha Kiran Questions Ysrcp Jana Sena Tdp

Vangaveeti Asha Kiran: 37 ఏళ్లుగా వంగవీటి రంగా కోసం ఏం చేశారు..? నిలదీసిన వంగవీటి ఆశా కిరణ్‌

Published Date :December 26, 2025 , 8:59 pm
By Sudhakar Ravula
  • వంగవీటి ఆశా కిరణ్ సంచలన వ్యాఖ్యలు..
  • ఎన్నికల్లో రంగా ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు..
  • వైసీపీ, జనసేన, టీడీపీని డైరెక్ట్ గా అడుగుతున్నా..
  • 37 ఏళ్లుగా రంగా కోసం మీరు ఏం చేశారు..
  • జిల్లాకు రంగా పేరు ఎప్పుడూ పెడతారు...
Vangaveeti Asha Kiran: 37 ఏళ్లుగా వంగవీటి రంగా కోసం ఏం చేశారు..? నిలదీసిన వంగవీటి ఆశా కిరణ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vangaveeti Asha Kiran: దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై వంగవీటి ఆశా కిరణ్ తీవ్ర స్వరంతో స్పందించారు. విశాఖపట్నం వేదికగా మన రంగానాడు పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె వైసీపీ, జనసేన, టీడీపీలను నేరుగా ప్రశ్నిస్తూ.. “37 ఏళ్లుగా మీరు రంగా కోసం ఏం చేశారు..?” అంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో రంగా ఫోటోను ప్రచారానికి వాడుకుంటూ ఓట్లు అడుగుతున్న పార్టీలు, ఆ తర్వాత ఆయన పేరును, ఆయన ఆశయాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఎన్నికల్లో రంగా ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.. మరి ఇన్నేళ్లలో ఆయన కోసం చేసిన పని ఏంటి? అంటూ ప్రశ్నించారు.

Read Also: Champion: ఛాంపియన్ సక్సెస్ గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చింది: నిర్మాత స్వప్న దత్

Also Read

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
  • Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్‌..
  • Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం

వంగవీటి రంగా పేరు మీద జిల్లాను ప్రకటించాలన్న డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చారు వంగవీటి ఆశా కిరణ్‌.. రంగా పేరు జిల్లాకు ఎప్పుడూ పెడతారు..? ప్రజల మనోభావాలను మీరు ఎప్పుడూ గౌరవిస్తారు?” అని ప్రశ్నిస్తూ రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచారు. అభిమానిగా నిలదీస్తా.. వారసత్వం కాదు, రంగా ఆశయమే ముఖ్యం అని స్పష్టం చేశారు.. తాను రంగా కూతురిగా కాకుండా ఒక అభిమానిగా మాట్లాడుతున్నానని, ఇకపై మృదువుగా వ్యవహరించేది లేదని పేర్కొన్నారు.. ఆడపిల్లను సాఫ్ట్‌గా ఉంటాను అనుకోవద్దు.. నాలో ఉన్నది రంగా రక్తమే.. వెనకడుగు వేసేది లేదు, సై అంటూ ముందుకే వెళ్తా అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

ఇక, రంగా అభిమానుల బలాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయనున్నట్లు ప్రకటించారు ఆశా కిరణ్‌.. ప్రతి గ్రామానికి వెళ్లి రాధా – రంగా మిత్ర మండలిని బలోపేతం చేస్తా.. రంగా ఆశయాల అమలే నా లక్ష్యం అని తెలిపారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సమావేశం నుంచే తనపై, తమ కార్యక్రమాలపై అడ్డంకులు మొదలయ్యాయని పేర్కొన్న ఆమె.. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటాం.. వెనకడుగు వేయడం రంగా కూతురికి అలవాటు లేదు అంటూ ధీమా వ్యక్తం చేశారు. వంగవీటి రంగా ప్రకటించిన 5 ప్రధాన ఆశయాల సాధన కోసం పనిచేస్తానని ఆమె వెల్లడించారు. దీనిని పార్టీ మానిఫెస్టోగా కాకుండా ఒక ప్రజా ఎజెండా, ప్రజా ఉద్యమ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు వంగవీటి ఆశా కిరణ్‌.. అయితే, ఆశా కిరణ్‌ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రంగా వారసత్వ రాజకీయాలకంటే, ఆయన ఆశయాల అమలుపై ప్రశ్నిస్తూ ఆమె తీసుకున్న స్టాండ్‌ రాజకీయ పార్టీల్లో చర్చకు దారి తీస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh district name Ranga
  • Andhra Pradesh Politics
  • AP politics Vangaveeti family
  • asha kiran
  • District Naming Demand

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions