వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశాకిరణ్ అసలు వ్యూహం ఏంటి? ప్రజల్లో ఉంటానంటారు, రాజకీయాల్లోకి రానంటారు. తన తండ్రికి సరైన గుర్తింపు దక్కలేదంటూ ఇన్నేళ్ళ తర్వాత వాదన వినిపిస్తున్నారు. ఇంతకీ ఏం కోరుకుంటున్నారు ఆశాకిరణ్? తాను గందరగోళంలో ఉన్నారా? లేక వ్యూహాత్మకంగా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఆశాకిరణ్…దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె. ఆమె వ్యవహారశైలి ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఇక నుంచి ప్రజల్లోనే ఉంటానని రెండు నెలల క్రితం ప్రకటించారామె. రాధా…
Vangaveeti Asha Kiran: దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై వంగవీటి ఆశా కిరణ్ తీవ్ర స్వరంతో స్పందించారు. విశాఖపట్నం వేదికగా మన రంగానాడు పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె వైసీపీ, జనసేన, టీడీపీలను నేరుగా ప్రశ్నిస్తూ.. “37 ఏళ్లుగా మీరు రంగా కోసం ఏం చేశారు..?” అంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో రంగా ఫోటోను ప్రచారానికి వాడుకుంటూ ఓట్లు అడుగుతున్న పార్టీలు, ఆ తర్వాత ఆయన పేరును, ఆయన…
వంగవీటి కుటుంబం నుంచి మరో వారసత్వం పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతోందా? అందుకోసం గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరిగిపోతోందా? కొత్తగా రాజకీయ ప్రవేశం చేయబోతున్న ఆ వారసులు ఎవరు? ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? అసలు ప్లానింగ్ ఏంటి? ఆశాకిరణ్…. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తళుక్కుమంటున్న సరికొత్త కిరణం. రాజకీయాల దిశగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వేస్తున్న అడుగులు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి అభిమానులు ఉన్నారు. రంగా…