Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో నాసిరకం రా మెటీరియల్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్లాంట్‌లో ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడానికి నాసిరకం ముడి పదార్థాలే ప్రధాన కారణమని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్వాలిటీ పరీక్షల నిర్వహణలో అధికారులు రాజీపడ్డారనే ఆరోపణలపై యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. ఒకేసారి 22 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య స్టీల్ ప్లాంట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
సస్పెన్షన్‌కు గురైన వారిలో SMS-1, SMS-2 విభాగాలతో పాటు క్యూఏటీడీ (Quality Assurance Technology Department)లో పనిచేస్తున్న సీనియర్ అధికారులు ఉన్నట్లు సమాచారం. నాణ్యత నియంత్రణలో జరిగిన లోపాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు జనరల్ మేనేజర్లు (GMలు), నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు (DGMలు) బదిలీకి గురయ్యారు. బాధ్యత నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని చర్యలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
Also Read
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
అయితే రా మెటీరియల్ కొనుగోలు, నాణ్యత తనిఖీలు, ఉత్పత్తి ప్రక్రియలో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సీటు (SIT)తో విచారణ చేపట్టాలని కోరుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్ఠకు సంబంధించిన ఈ అంశంలో పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!