Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. మరొకరి మృతి..!
- 80% కాలిన గాయాలతో సూరిబాబు మృతి
- ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కు చేరిక
- నలుగురు కార్మికులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగింపు
- బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కార్మిక సంఘాల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakha Steel Plant: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (స్టీల్ ప్లాంట్)లో జరిగిన భారీ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మరో కార్మికుడు కన్నుమూశారు. ప్రమాద తీవ్రతకు గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సూరిబాబు అనే కార్మికుడు పరిస్థితి విషమించడంతో మరణించారు. దీంతో ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 10కి చేరుకుంది.
80 శాతం గాయాలతో కన్నుమూత
ప్రమాదం జరిగిన సమయంలో ఉక్కు కరుగుతున్న వేడి ద్రవం (మోల్టెన్ స్టీల్) సూరిబాబు శరీరంపై పడటంతో ఆయనకు దాదాపు 80 శాతానికి పైగా తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. సూరిబాబు పెదగంటాడ మండలం, సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన మరణవార్త తెలియడంతో సీతానగరం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
- President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
ఆసుపత్రుల్లో నలుగురికి చికిత్స
ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన నలుగురు కార్మికులు ప్రస్తుతం నగరంలోని వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ముగ్గురు శీలానగర్లోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం సమీక్షిస్తోంది.
స్టీల్ ప్లాంట్ హిస్టరీలోనే అత్యంత దారుణమైన ఈ పారిశ్రామిక ప్రమాదం కార్మిక లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యాజమాన్యం , ప్రభుత్వం బాధితులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..