Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామాలు.. భేటీకి ముందే చర్యలు..
- విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేగంగా మారుతున్న పరిణామాలు..
- నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ..
- సమావేశం కంటే ముందే కీలక చర్యలు..
- స్టీల్ ప్లాంటు సీఎండీగా ఉన్న అతుల్ భట్ విధుల నుంచి తొలగింపు..
- రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేగంగా మారుతున్నాయి పరిణామాలు.. నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశం కంటే ముందే కీలక చర్యలకు దిగింది సర్కార్.. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సీఎండీగా ఉన్న అతుల్ భట్‌ను విధుల నుంచి తప్పించింది.. ఆయన రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ప్రస్తుతం వున్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది.. కాగా.. ప్లాంట్ ప్రయివేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి.. ప్లాంట్ లో తాజాగా ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలైన పరిణామాలు కనిపించాయి.. దీంతో, ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుందని కార్మిక సంఘాలో ఆరోపిస్తున్నాయి.. 19 వేల పైచిలుకున్న స్టీల్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 8 వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోందని కొందరు అంచనా వేస్తున్నారు.. ఇది ఉత్పత్తిపై తీవ్ర దుష్ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.. అయితే, ఇప్ఉడు సీఎండీని తప్పించడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏంటి అనేది వేచిచూడాల్సిన అంశంగా ఉంది.. ఈ రోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Haryana Elections: కాంగ్రెస్-ఆప్ మధ్య చెడిందా..? ఆ రాష్ట్రంలో రెండు పార్టీలు ఒంటరిగా పోటీ..
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
మరోవైపు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి.. 45 రోజుల్లో అన్నీ చక్కదిద్దబడతాయని, ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రశ్నేలేదని ప్రకటించిన విషయం విదితమే.. కానీ, ఆ తర్వాత పరిణామాలు చూస్తే 2025 నాటికి 2500 మందికి వీఆర్ఎస్ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైందనే చర్చ సాగింది.. ఇందుకోసం రూ.1260 కోట్లు సిద్ధం చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. నాగర్నార్ స్టీల్‌ప్లాంట్‌లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే విశాఖ యాజమాన్యం 500 మందిని డిప్యుటేషన్‌పై పంపేయాలని నిర్ణయం చేయడం చూస్తే వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఖాళీ అయిపోతుందన్నది అనుమానాలు తావు ఇచ్చింది.. అయితే, ఈ రోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంటూ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!