CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- సీఎం విజయ్ లండన్ పర్యటనపై తీవ్ర దుమారం
- త్రిషతో కలిసి విదేశాలకు వెళ్లడంపై విపక్షాలు ఫైర్
- ప్రజాధనంతో విదేశాల్లో షికార్లు చేస్తున్నారని విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్‌లో పర్యటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ త్రిషతో కలిసి లండన్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పెట్టుబడుల కోసం లండన్‌కు వెళ్తున్నట్లు చెప్పి.. ప్రజాధనంతో విదేశాల్లో షికార్లు చేస్తారా? అంటూ ప్రతిపక్ష పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. త్రిషతో కలిసి పెట్టుబడులకు వెళ్లడమేంటి? అని నిలదీస్తున్నాయి.
ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి విజయ్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. విజయ్ను ఎద్దేవా చేస్తూ.. తాను తమిళనాడు ముఖ్యమంత్రి లండన్ పర్యటన ఫొటోలను చూశానని.. అందులో ఒక్క పారిశ్రామికవేత్త కూడా లేరని పళనిస్వామి ధ్వజమెత్తారు. పెట్టుబడుల కోసం లండన్ వెళ్లారని చెబుతున్నారని.. అసలు అలాంటి సమాచారం లేదని ఎద్దేవా చేశారు.
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
బీజేపీ ధ్వజం..
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా విజయ్ పర్యటనను ప్రశ్నించారు. విజయ్‌తో పాటు లండన్‌లో పర్యటిస్తున్న వారి గురించి స్పష్టత కోరారు. మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో విజయ్‌తో పాటు నటి త్రిష ఎందుకు కనిపించిందని ప్రశ్నించారు.
‘‘పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో సీఎం విజయ్ లండన్ పర్యటనను 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అధికారికంగా ప్రకటించారు. ఐదు రోజులు గడిచినా పెట్టుబడులకు సంబంధించిన ఒక్క సమావేశం గానీ.. కార్యక్రమం గానీ వాస్తవంగా జరిగినట్లు అధికారిక సమాచారం ఏదీ లేదు. నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న ఒక కార్ రేసులో ముఖ్యమంత్రి కనిపించిన కార్యక్రమాన్ని మాత్రమే మేము చూశాము. టెలివిజన్ ఛానెళ్లు, సోషల్ మీడియాలో ప్రసారమైన ఫుటేజీలో మంత్రి అధవ్ అర్జున, నటి త్రిష కనిపించారు. పెట్టుబడిదారులు మాత్రం కనిపించలేదు.’’ అని బీజేపీ నాయకుడు నారాయణన్ తిరుపతి అన్నారు.
CM Vijay, actress Trisha, and Minister Aadhav Arjuna watching the car race.. https://t.co/jfwtHPRZoz
— Pokkiri_Victor (@Pokkiri_Victor) September 12, 2026
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!