విశాఖపట్నంలో కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.. రోడ్లను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగిరు.. అయితే.. నిరసనకారులకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. కార్మిక నేతలను ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించారు పోలీసులు.. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది..
విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేగంగా మారుతున్నాయి పరిణామాలు.. నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశం కంటే ముందే కీలక చర్యలకు దిగింది సర్కార్.. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సీఎండీగా ఉన్న అతుల్ భట్‌ను విధుల నుంచి తప్పించింది.. ఆయన రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ప్రస్తుతం వున్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది..