విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాద స్థలిని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బృందం పరిశీలించింది. బొత్స వెంట మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు.
విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో బుధవారం జరిగిన ప్రమాదంపై దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.
విశాఖకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. దీంతో సింహాచలం ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవానికి భక్తులు క్యూకట్టారు. వర్ష సూచన నేపథ్యంలో భక్తులకు వేగంగా దర్శనాలు చేయిపిస్తున్నారు.
విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ పతి దుర్గ స్వామి నాయుడు (32) సహా అతని స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29) ప్రాణాలు కోల్పోయారు.