MLC Botsa Satyanarayana: తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సుమోటోగా తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ విజ్ఞప్తి చేశారు. సారీ చెప్పడం ద్వారా జరిగిన నష్టం నుంచి తప్పించుకోలేరని.. ప్రయశ్చిత దీక్ష సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల్లో ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు. తొక్కిసలాట దైవ నిర్ణయం అనే వ్యాఖ్యలు… కుట్ర కోణం ఉంది అనే మంత్రుల మాటలు చూస్తే పాలకవర్గం, ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తోందన్నారు బొత్స. రాజకీయాలు చేయడం ద్వారా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగిన ఘటన నుంచి తప్పించుకోలేరు అన్నారు బొత్స..
Read Also: Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్
ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్ల తిరుపతిలో ఆరు ప్రాణాలు పోయాయి… ప్రభుత్వాలు ఎన్ని మారినా.. దురదృష్టకర ఘటనలు గతంలో ఎన్నడు చోటు చేసుకోలేదు.. ఇది చాలా బాధాకరం అన్నారు బొత్స.. తొక్కిసలాట వెనుక కుట్ర కోణం, డబ్బులు ఇచ్చారు అని చెప్పడం తప్పించుకోవడమే అవుతుందన్న ఆయన.. తిరుపతి ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి.. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి కలిగించుకొని విచారణ చేయించాలని సూచించారు.. కూటమి ప్రభుత్వం నియమించిన అధికారులు విధుల్లో ఉన్నప్పుడు కొంత మందికి పార్టీలు, కులం ముద్రలు వేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం కదా..? అని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే ట్రాఫిక్ లో కావాలనే ఆపేయడం ఎంత వరకు సమంజసం.. ఇటువంటి చర్యల వల్లే సమస్యలు వస్తాయని హెచ్చరించారు.. ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి సరిపెట్టేశారు.. ఇంగ్లీషోడు థాంక్స్ అని చెప్పినట్టు.. ఒక్క సారీ చెప్పేస్తే సరిపోతుందా? అని మండిపడ్డారు.
Read Also: CM Revanth Reddy: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆగ్రహం..
తిరుపతి తొక్కిసలాట తర్వాత వైకుంఠ దర్శనం కోసం గుడికి వెళ్లడానికి భక్తులు భయపడ్డారు.. అందుకే గుళ్లు ఖాళీగా వున్నాయన్నారు బొత్స.. పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం మొదలు పెట్టి ఇన్నేళ్లు అయితే.. ఇవాళే ఎందుకు తొక్కిసలాట జరిగింది అని నిలదీశారు.. జగన్మోహన్ రెడ్డి బాధితులకు అండగా నిలిస్తే వక్రీకరించే విధంగా చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసం అని మండిడపడ్ఆరు.. ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి విజయవాడ వరదలు నుంచి తిరుపతి తొక్కిసలాట వరకు అదే కారణం అన్నారు బొత్స సత్యనారాయణ.