Doctors Negligence: విశాఖపట్నంలోని కేజీహెచ్ లో మరో సారి వైద్యుల నిర్లక్ష్యం బయట పడింది. పీజీ డాక్టర్ల నిర్లక్ష్యనికి శిశువు మృతి చెందింది. వారం రోజుల కిందట కేజీహెచ్ లో అడ్మిట్ అయిన సింహాచలం ప్రాంతానికి చెందిన పి. ఉమా దేవీ అనే గర్భిణీని డెలివరీ సమయంలో జూనియర్ డాక్టర్లు టార్చర్ పెట్టారు. నార్మల్ డెలివరీ చేయడానికి నానా విధాలుగా ప్రయత్నించి విఫలం అయ్యారు. చివరకు గర్భిణీని కొట్టి, ఆమె పైకి ఎక్కి బలవంతంగా ఫుష్ చేసి బేబీ మృతికి కారణమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Read Also: 108MP కెమెరా, 5520mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో స్లిమ్ డిజైన్‌తో వస్తున్న Redmi Note 15!
అయితే, సీనియర్ డాక్టర్లు లేకుండానే గర్భిణీపై ప్రయోగం చేశారని గర్భీణి బంధువులు ఆరోపించారు. గర్భంలో ఉన్న బేబీలో కదలికలు లేకపోవడంతో సర్జరీ చేసి బిడ్డను బయటకి తీశారు వైద్యులు.. అప్పటికే శిశువు మృతి చెందింది.. శిశువు మృతికి కారణమైన జూనియర్ వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ.. గైనకాలజీ డిపార్ట్మెంట్ దగ్గర మృతి చెందిన శిశువు తల్లి, బంధువులు ఆందోళన చేపట్టారు.