Andhra Pradesh: మరో నాలుగు రోజులు వడగళ్ల వాన..! వాతావరణశాఖ హెచ్చరిక
- ఏపీలో మరో నాలుగు రోజులు అకాల వర్షాలు..
- ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని ఐఎండీ హెచ్చరిక..
- ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణశాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.. చేతికి అందివచ్చిన పంట.. అకాల వర్షం నేలపాలు చేసింది.. వేలాది ఎకరాల్లో పంట నష్ట వాటిల్లింది.. అయితే, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ చేసిన హెచ్చరికలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి.. ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని.. ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వడగళ్ల వాన పడుతుందని పేర్కొంది.. ఇక, విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోంది.. బంగాళాఖాతంలో బలంగా విస్తరిస్తోంది ద్రోణి.. ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలుల కారణంగా ఏర్పడుతున్న క్యుములో నింబస్ మేఘాలతో వర్షం, వడగళ్ల వాన, పిడుగులు పడతాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.. పంట పొలాల్లో ఉండే వాళ్లు వర్షం కురిసే సమయంలో.. చెట్లకు దూరంగా ఉండాలని.. సూచించారు.
Read Also: Sonal Chauhan : బీచ్ లో సోనాల్ చౌహన్ సొగసులు చూసి తీరాల్సిందే
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..