GVMC: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ.. ఆ ఒక్కదానిపైనే వైసీపీ ఆశలు..!
- అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై అధిపత్యం ఎవరిది..
- మేయర్ అవిశ్వాసం విషయంలో కొనసాగుతోన్న ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVMC: కొద్దిగంటలు మాత్రమే సమయం…! నెలరోజుల ఉత్కంఠకు తెరపడుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై అధిపత్యం ఎవరిదో తేలిపోతుంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేయగా ముగ్గురు జనసేనాలో చేరిపోయారు. మాజీమంత్రి అవంతి కుమార్తె ప్రియాంక సైతం కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చేరికలు అన్నీ తమకు ప్లస్ అనుభవిస్తున్న టీడీపీ.. ఆఖరి నిముషంలో ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే అవిశ్వాసం నెగ్గడం ఎలా…? అనే తర్జనభర్జనల్లో వుంది.
మలేషియా క్యాంపు నుంచి వచ్చే కార్పొరేటర్ లను నేరుగా భీమిలి రిసార్ట్ కు తరలిస్తుంది. అక్కడి నుంచే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి నేరుగా కౌన్సిల్ సమావేశానికి రప్పించాలనేది టీడీపీ ఆలోచన. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేయర్ పీఠం కూటమి కైవసం కావడం ఖాయం అనే ధీమా ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించింది. ఫ్యాన్ సింబల్ పై గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. వీళ్ళలో 25 మంది పార్టీ ఫిరాయించగా అనర్హత వేటుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న కార్పొరేటర్లకు నేరుగాను… క్యాంపులకు వెళ్లిపోయిన వాళ్ళ కు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసింది. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని బలంగా విశ్వశిస్తున్న వైసీపీ… ఈ వ్యవహరం అంతా ముగిసే వరకు కార్పొరేటర్ లను క్యాంప్ లోనే కొనసాగాలని నిర్దేశించింది. ఇప్పటికే కూటమి వైసీపీ సభ్యులపై ఆకర్ష కొనసాగిస్తుండగా.. ప్రతిపక్షం సైతం అధికార పార్టీ వైపు ఉన్న ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు వెనక్కి వస్తారని అంచనాలో ఉంది. ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురిచేయడం ద్వారా పెంచుకున్న బలంతో ఓటమి దౌర్జన్యాలకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపణ.
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
అవిశ్వాసం పై వైసీపీ, కూటమి పార్టీలు ప్రతిష్టకు పోవడం., సంఖ్యాబలం విషయంలో ఊగిసలాట కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. కేవలం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా ఇతరులు ఎవరు జీవీఎంసీ చుట్టుపక్కల లేకుండా చర్యలు తీసుకుంతోంది. 300 మందికి పైగా పోలీసులను భద్రతకు వినియోగించాలని నిర్ణయించారు. సమావేశ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల సర్వేలెన్సులో ఉండేలా జాగ్రత్తలు పాటించారూ.
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?