బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది..