Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితం అయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవు అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి.. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించేనాటికి ప్రభుత్వం దగ్గర 377 ఎకరాల భూమి మాత్రమే ఉంది.. పరిహారం, కోర్టు కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
Read Also: Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో లాయర్ కళ్యాణ్ సంచలన విషయాలు
అయితే, వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పుడు తెలుగు దేశం పార్టీ పేర్లు పెట్టుకుంటోంది అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. BPCL రిఫైనరీ ఏర్పాటుకు మా ప్రభుత్వంలో అనువైన ప్రదేశాలను కోసం బృందాలు పరిశీలించాయి.. అది నిజమో కాదో అధికారులను అడగండి అని సవాల్ చేశారు. ఎన్నికల్లో చేసిన ప్రచారాలకు తర్వాత పెట్టిన కండీషన్లు చూస్తుంటే సూపర్ సిక్స్ ఎంత వరకు అమలు అవుతుందనేది ఆందోళన కలిగిస్తోందన్నారు. జీవో నెంబర్ 29 మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి.. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన టీడీపీ.. ఇప్పుడు తల్లులకు మాత్రమే 15 వేలు అని చెప్పడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ ఆయన మండిపడ్డారు. ఇసుక ఫ్రీ అని చెప్పి చార్జీలతో 1394 రూపాయలు టన్నుకు పెట్టీ కండిషన్స్ అప్లై అంటున్నారు.. మీ భాగస్వామ్యంతో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరించదు.. మీడియా ఆఫీసులపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందకుండా ఏ విధంగా ఉండగలుగుతారు అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.