Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో లాయర్ కళ్యాణ్ సంచలన విషయాలు
- సంచలనంగా రాజ్ తరుణ్ లావణ్యల కేసు
- లావణ్యకు సపోర్టుగా లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర
- రాజ్ రిమాండ్ కు పోవాల్సిందే అంటూ తేల్చేసిన లాయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Tarun Lavanya : రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. అలాగే రాజ్ తరుణ్ కు హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు సంబంధం ఉందని.. మాల్వి మల్హోత్రా కోసమే తనను దూరం పెట్టాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తనకు అబార్షన్ చేయించాడు అంటూ మరో బాంబు కూడా పేల్చింది. ఇప్పుడు లావణ్యకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర అండగా నిలిచాడు. కళ్యాణ్ దిలీప్ సుంకర.. ఒకప్పుడు జనసేన పార్టీ కోసం పని చేసిన లాయర్ కూడా. కొన్ని పేరున్న కేసులు డీల్ చేయడం ద్వారా అతను పాపులారిటీ సంపాదించాడు. నాగబాబు తనయురాలు నిహారికకు విడాకులు ఇప్పించింది కూడా అతడే. ప్రస్తుతం కళ్యాణ్ టేకప్ చేసిన కేసు హాట్ టాపిక్‌గా మారింది.
Read Also:Gannavaram: బాపులపాడు హైవేపై నిలిచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది.. !
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రతిగా లావణ్య మీద రాజ్ అనేక ఆరోపణలు చేశాడు. అతను కూడా లావణ్య మీద ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పాడు. ఈలోపు రాజ్‌తో సంబంధం ఉందని లావణ్య ఆరోపిస్తున్న మాల్వి మల్హోత్రా అనే ముంబయి అమ్మాయి.. లావణ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ కేసులోకి దిలీప్ సుంకర ఎంట్రీ ఇచ్చాడు. అతను లావణ్య తరఫున కేసును టేకప్ చేశాడు. రాజ్ మీద చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటూ నార్సింగి పోలీసులు లావణ్యకు నోటీసులు ఇవ్వగా.. ఆమె లాయర్ అయిన దిలీప్ సుంకర ఈ పని పూర్తి చేశాడు. ఏకంగా 120కి పైగా కాల్ రికార్డ్స్‌తో పాటు అనేక ఫొటోలు, వీడియోలు పోలీసులకు సమర్పించినట్లు దిలీప్ మీడియాతో చెప్పాడు.
Read Also:RC16: ‘కరునాడ చక్రవర్తి’కి స్వాగతం.. శివన్న లుక్ వైరల్!
రాజ్ తరుణ్.. లావణ్యతో సహజీవనం చేసి మోజు తీరాక వదిలించుకోవాలని భావిస్తున్నట్లు దిలీప్ సుంకర ఆరోపించాడు. వీళ్లిద్దరికీ పెళ్లి కూడా జరిగిందని.. విడాకుల కోసం రాజ్ ప్రయత్నించాడు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయంటూ అతడు చెప్పుకొచ్చాడు. లావణ్యకు బలవంతంగా అబార్షన్ చేయించిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను ఆమె తనకు చూపించిందని వాటిని మీడియా ముందు ప్రదర్శించాడు. కేసు వాపస్ తీసుకుంటే ఐదు కోట్లు ఇస్తామంటూ రాజ్ వైపు నుంచి ప్రపోజల్స్ పెట్టిన మెసేజ్‌లు, కాల్ రికార్డ్స్ ఉన్నాయని, రాజ్ డ్రగ్స్ కేసులో లావణ్యను ఎలా ఇరికించడానికి చూశాడు.. ఆమె మీద ఎలా ఎటాక్ చేయించాడు.. ఇలా అనేక విషయాల్లో ఆధారాలున్నాయని.. అవన్నీ పోలీసులు, కోర్టుకు ఇస్తున్నామని.. ఈ కేసులో రాజ్ తరుణ్ రిమాండుకు వెళ్లడం ఖాయమన్నాడు. తమ ఆరోపణలపై మీడియా ముందు చర్చకు కూడా సిద్ధమని రాజ్, మాల్విలకు దిలీప్ సుంకర సవాలు విసిరాడు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..