CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన సభా ప్రాంగణానికి చేరుకోగానే లబ్ధిదారులు, సభికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ తమ స్థానాల్లో నిలబడి చేతులు ఊపుతూ ఘన స్వాగతం పలికారు. ప్రజల ఉత్సాహానికి ప్రతిగా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద నడుస్తూ అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు ఉన్నారు.
ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. పేదలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వేచ్ఛగా, గౌరవప్రదంగా బతకాలనే ఉద్దేశంతోనే రాజముద్ర వేసి మరీ ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా కల్పించే పూర్తి బాధ్యత తమ కూటమి ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చేశారు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
అంతే కాకుండా.. మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే పట్టాలు అందజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రస్తుతం మరో 35 కాలనీల్లో పది వేల మంది ఇళ్ల పట్టాలు కోరుతున్నారని, అలాగే దేవస్థానానికి చెందిన పంచగ్రామాల్లో మొత్తం 12,149 మందికి చట్టబద్ధంగా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు దక్కేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రాంతానికి రెండేళ్లలో 91 కొత్త ప్రాజెక్టుల ద్వారా ఐదు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి అనకాపల్లికి నీళ్లు తీసుకువచ్చామని, త్వరలోనే విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని స్పష్టం చేశారు. అల్లూరి విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రజల కలలు నెరవేరాయన్నారు. విశాఖకు కొత్తగా హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు వచ్చాయని, భవిష్యత్తులో ఇది అగ్రగామి టూరిజం, లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!