ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక 'కీ' విడుదల చేసింది. రెండు పేపర్ల 'కీ' లు ఏపీపీఎస్సీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది.
గ్రూప్ -2 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.. విశాఖపట్నంలో తమ పోరును ఉధృతం చేశారు గ్రూప్-2 అభ్యర్థులు.. ఇసుక తోట జంక్షన్ లో జాతీయ రహదారిని దిగ్భందించి నిరసనకు దిగారు.. దాంతో, భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన అడ్డుకునేందుకు పోలీసులులు ప్రయత్నించారు.. దీంతో, పోలీసులకు అభ్యర్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. ఎగ్జామ్ బాయ్ కాట్ చేయాలి అంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు గ్రూప్-2 అభ్యర్థులు..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గ్రూప్ 2 మెయిన్స్ పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై APPSCకి లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం.. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా కోరుతూ ప్రభుత్వం లేఖ…
గ్రూప్ 2 పరీక్షలు నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది.. హరిజెంటల్ రిజర్వేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తదుపరి చర్యలు నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిలుపుదల సాధ్యం కాదని స్పష్టం చేసింది..