Fishing Boat: విశాఖపట్నం సముద్ర తీరంలో ఓ ఫిషింగ్ బోటు తునాతునకలైంది. అలలధాటికి కొట్టుకుని వచ్చి రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. దీనిని తరలించేందుకు ప్రయత్నించగా పూర్తిగా మునిగిపోయింది. దీంతో తీరం వెంబడి బోట్ శకలాలు చెల్లాచెదురుగాపడ్డాయి. ఉదయం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోటు.. తిరుగు ప్రయాణంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఇంజిన్ మొరాయించడంతో విశాఖ తీరానికి సమీపంలో నిలిచిపోయింది. మరమ్మత్తుల కోసం మరో రెండు బోట్లతో ఒడ్డుకు తరలించేందుకు చేసిన ప్రయత్నం విఫలం అయింది. లంగరు తెగిపోవడంతో అదుపు తప్పి కొట్టుకుని వచ్చేసిందని యజమాని చెప్పారు. ప్రమాదం జరిగే సమయంలో ఐదుగురు మత్స్యకారులు వుండగా వాళ్ళంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆస్ధినష్టం విలువ 20 లక్షలు అంచనా వేస్తున్నారు.కాగా, ఆ మధ్య విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఓ బోటులో చెలరేగిన మంటలు.. ఆ తర్వాత చాలా బోట్ల దగ్ధానికి కారణమైన ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే.