విశాఖపట్నం సముద్ర తీరంలో ఓ ఫిషింగ్ బోటు తునాతునకలైంది. అలలధాటికి కొట్టుకుని వచ్చి రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. దీనిని తరలించేందుకు ప్రయత్నించగా పూర్తిగా మునిగిపోయింది. దీంతో తీరం వెంబడి బోట్ శకలాలు చెల్లాచెదురుగాపడ్డాయి. ఉదయం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోటు.. తిరుగు ప్రయాణంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఇంజిన్ మొరాయించడంతో విశాఖ తీరానికి సమీపంలో నిలిచిపోయింది.