Hurricane Helene : అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు గత రెండు రోజులుగా ‘హెలెన్’ తుపానును ఎదుర్కొంటున్నాయి. వీటిలో ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య కనీసం 30కి చేరుకుంది. ‘హెలెన్’ హరికేన్ ఫ్లోరిడా, జార్జియాతో సహా మొత్తం ఆగ్నేయ అమెరికాలో శుక్రవారం భారీ విధ్వంసం సృష్టించింది. నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం.. హెలెన్ హరికేన్ గురువారం రాత్రి 11:10 గంటలకు ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ గ్రామీణ ప్రాంతంలో తీరాన్ని తాకింది. ఆ సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 225 కిలోమీటర్లు. హెలెన్ శుక్రవారం ఉదయం జార్జియాను దెబ్బతీసింది. జార్జియా తాకినప్పుడు దాని గాలి వేగం గంటకు 177 కిలోమీటర్లు.
Read Also:Vulgar Dancing In School: చదువుకునే స్కూల్లో బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలు..
విద్యుత్ సరఫరా కట్
హెలెన్ హరికేన్ కారణంగా జార్జియా రోడ్లు నీటిలో మునిగిపోయాయి. జార్జియాలో ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. అయితే దీని సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తుఫాను కారణంగా ఆగ్నేయ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. బలమైన గాలులు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హెలెన్ తుఫాను ఉత్తర దిశగా కదులుతున్నట్లు కూడా చెబుతున్నారు. తుఫాను రాకముందే ఫ్లోరిడాలో బలమైన గాలుల కారణంగా దాదాపు 9 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Read Also:Suicide : సెల్ఫీ వీడియో తీసుకొని ఓ యువకుడు ఆత్మహత్య..
ఎమర్జెన్సీ ప్రకటన
అదనంగా.. ఎన్ డబ్ల్యూఎస్ అట్లాంటా, పరిసర ప్రాంతాలతో సహా సెంట్రల్ జార్జియాకు ఫ్లాష్ వరద హెచ్చరికను జారీ చేసింది. ఈ ప్రాంతంలో 246 పాఠశాలలు, 23 ఆసుపత్రులు ఉన్నాయని, ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది నివాసితులు ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించింది. ఫ్లోరిడా, జార్జియా, అలబామా, కరోలినాస్, వర్జీనియా గవర్నర్లు తమ తమ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. తుఫానును ఎదుర్కొనేందుకు జార్జియా గవర్నర్ అదనపు బలగాలను, సహాయక సిబ్బందిని మోహరించారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, హెలీన్ హరికేన్ సౌత్ కరోలినాకు చేరుకోవచ్చు.