Eat Right Station certification: ఈ రైల్వే స్టేషన్లకు ‘ఈట్ రైట్ స్టేషన్’గా 5స్టార్ రేటింగ్..
- విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్..
- అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు..
- విజయవాడ, అన్నవరం, గుంటూరు, నాంపల్లి, నడికుడి రైల్వెస్టేషన లకు..
- సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఈట్ రైట్ స్టేషన్లుగా 5 స్టార్ సర్టిఫికేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eat Right Station certification: విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి ‘5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన ‘ఈట్ రైట్ స్టేషన్’ ధృవీకరణను పొందింది. పూర్తి పరిశుభ్రత, క్వాలిటీ, వాడే ప్రతీ ఆహార పదార్దంలోనూ ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం, స్టాండర్డ్ ప్రకారం ఉండాల్సిన అన్ని ప్రమాణాలను అనుసరించడం ప్రధానంగా ఇక్కడ గుర్తించాలి.. దాదాపు ఆరు నెలలపాటు జరిగిన పలు ఆడిట్‌ల అనంతరం, పూర్తిస్ధాయి శిక్షణ తరువాత FSSAI అధికారులు ఈట్ రైట్ స్టేషన్‌గా 5 స్టార్ రేటింగ్ ను ఇచ్చారు.. ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, అన్నవరం, గుంటూరు, నాంపల్లి, నడికుడి రైల్వెస్టేషన లకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఈట్ రైట్ స్టేషన్లుగా 5 స్టార్ సర్టిఫికేట్ వచ్చింది…
Read Also: KTR: మళ్ళీ కేసీఆర్ను సీఎంను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం..
Also Read
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్‌రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
ప్రధానంగా రైలులో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడూ రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ లో ఉంటారు.. అలాంటిది విజయవాడ ద్వారా దాదాపు రోజుకు 4 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు.. అలాంటి చోట కచ్చితంగా వెయిటింగ్ లో ఉండే ప్రయాణికులు లక్షల్లోనే ఉంటారు.. పూర్తిస్ధాయిలో అన్నీ పరిశీలించిన తరువాత ప్రతీ ఒక్కరిని పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి, స్టాండర్డ్ లను పూర్తిగా పాటించేలా చేసి, ఈట్ రైట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారు విజయవాడ రైల్వేస్టేషన్ అధికారులు.. పలు విధాలుగా ఆడిట్ నిర్వహించిన FSSAI అధికారులు విజయవాడ రైల్వేస్టేషన్ కు 5 స్టార్ రేటింగ్ ఇస్తూ ఈట్ రైట్ స్టేషన్ గా సర్టిఫికేట్ ఇచ్చారు.. ఈ సర్టిఫికేట్ రెండు సంవత్సరాల పాటు అర్హత ఇస్తుంది.. ఆ తరువాత మరోసారి FSSAI ఆడిట్ నిర్వహించి, మరోసారి కూడా అర్హత వస్తే ఈట్ రైట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మొత్తంగా అన్నవరం, గుంటూరు, నడికుడి, నాంపల్లి రైల్వే స్టేషన్‌లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్‌లో ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేషన్ పొందాయని అధికారులు వెల్లడించారు..
తాజావార్తలు
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!