Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ పదవి ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఛైర్మన్ పదవిని తమ వారికి ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేయడంతో పార్టీలో పోటీ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చలసాని రాజీనామా వ్యవహారంతో విజయ డైరీ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తాజాగా ఛైర్మన్ ఎంపిక విషయంలోనూ కొత్త రచ్చ మొదలైంది.
విజయ డైరీ ఛైర్మన్ పదవి కోసం పలువురు పేర్లను ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు సమాచారం. పాలడుగు నానికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే అర్జా నగేష్ పేరును ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సూచించినట్లు సమాచారం. మరోవైపు డైరెక్టర్‌గా ఉన్న చక్రవర్తికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని మరో ఎమ్మెల్యే ప్రతిపాదించగా, మరో మహిళా డైరెక్టర్‌కు అవకాశం కల్పించాలని ఇంకో ఎమ్మెల్యే సూచించినట్లు తెలుస్తోంది.
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ఇలా ఒకే పదవి కోసం పలువురు పేర్లు తెరపైకి రావడంతో విజయ డైరీ ఛైర్మన్ ఎంపిక వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చలసాని రాజీనామాతో విజయ డైరీ విషయంలో పార్టీలో రచ్చ జరిగిందని భావిస్తున్న అధిష్టానం.. మరోసారి విభేదాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ఎంపికను వారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎలాంటి విభేదాలు, వివాదాలు లేకుండా ఛైర్మన్ ఎంపిక ఏకగ్రీవంగా జరిగేలా చూడాలని మంత్రి కొల్లు రవీంద్రకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
పలువురు ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన పేర్లను ప్రతిపాదించిన నేపథ్యంలో.. అందరినీ సమన్వయం చేసి ఏకాభిప్రాయం తీసుకురావడంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారం రోజుల తర్వాత విజయ డైరీ కొత్త ఛైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై విజయవాడ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!