Off The Record : కంచు కోటకు కన్నాలు పడుతుంటే… టీడీపీ అధిష్టానం చోద్యం చూస్తోందా? మాకో నాయకుడు కావాలి మొర్రో… అని కేడర్ మొత్తుకుంటున్నా, బాధ్యతలు తీసుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్నా… పార్టీ పెద్దలు మాత్రం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు? అధికారంలో ఉండి కూడా.. మిత్రపక్షం ఎమ్మెల్యే ఉన్న చోట ఒక ఇన్ఛార్జ్‌ని పెట్టుకోలేని దైన్యం ఏంటి? ఎక్కడ తేడా కొడుతోంది.. శ్రీకాకుళం జిల్లా ముఖ ద్వారం, వెనుకబాటు ఉన్న చోట అభివృద్ధి జాడలు…
సమావేశానికి గైర్హాజరై 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉoడటo సరికాదని ముగింపు సందేశంలో గట్టిగా క్లాస్ పీకారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు,
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది.
టీడీపీలో ఆళ్ల నాని చేరిక మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీడీపీలోకి ఆళ్ల నానిని తీసుకునేందుకు పార్టీ పెద్దలు నిన్న ముహూర్తం ఫిక్స్ చేయగా.. పార్టీ అధినేత సమయం ఇవ్వక పోవడంతో ఆళ్ల నాని చేరిక వాయిదా పడింది. ఆళ్ల నాని చేరికపై టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.