Satya Vardhan Kidnap Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కీలక అనుచరుడైన కొమ్మా కోట్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ–2 నిందితుడిగా ఉన్న కోట్లును పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా కోట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, అతని కోసం పోలీసులు గాలింపు కొనసాగించారు. చివరకు అతడు బస చేసిన ప్రదేశంపై ఖచ్చితమైన సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పట్టుకున్నాయి.. అదే సమయంలో, గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోట్లు నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ రెండు కేసుల్లో అతని ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది. పోలీసులు నేడు కోట్లు అరెస్టును అధికారికంగా నమోదు చేసి, కేసు వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం. కాగా, సత్యవర్ధన్‌ను బెదరించడం, కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత పలు కేసులను ఎదుర్కొన్నారు.. అనారోగ్యంతో.. జైలులోనే అవస్థలు పడ్డారు.. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన విషయం విదితమే..
Read Also: Tension in Mangalagiri: కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం.. మంగళగిరిలో ఉద్రిక్తత..