Tension in Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగించేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళగిరి యాదవపాలెంలో కృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం తనదేనంటూ మునగపాటి వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్లారు.. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కృష్ణుడి విగ్రహం తొలగించాలని ఆదేశించింది. ఇక, కోర్టు ఆదేశాలతో మంగళగిరి మున్సిపల్ సిబ్బంది వచ్చారు. ఇదే సమయంలో యాదవ సంఘాల నేతలు అక్కడకు చేరుకున్నారు. విగ్రహం తొలగిస్తే మరోచోట ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. యాదవ సంఘాల నేతలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు ఆదేశాలున్నాయని అధికారులు చెప్పారు. కొంత సమయం ఇస్తే తామే తొలగిస్తామని యాదవ సంఘం నేతలు కోరారు. విగ్రహం తొలిగించేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, కృష్ణుడి విగ్రహం తొలగింపు కోసం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నం చేయడం.. యాదవ సంఘాల నేతలు, సభ్యులు పెద్ద ఎత్తున్న అక్కడికి చేరి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి..
Read Also: ఓరి దేవుడా, మరీ ఇంత తక్కువా.. Google Pixel 9 Proపై దిమ్మతిరిగే ఆఫర్ భయ్యో!