అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మురుగన్ సినిమా ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే. నిజానికి అల్లు అర్జున్ హీరోగా సినిమా ముందు ప్లాన్ చేశారు అయితే అల్లు అర్జున్ వేరే ప్రాజెక్టులో బిజీ కావడంతో ఈ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. ఈ విషయాన్ని నాగవంశీ పలు సందర్భాలలో హింట్ ఇచ్చి, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేశాడు.
Also Read : Kannappa: ‘కన్నప్ప’ టైం బాగున్నట్టే ఉంది!
అయితే ఇప్పుడు ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయి ఎయిర్పోర్టులోకి ఎంటర్ అవుతున్న క్రమంలో కెమెరా కంటికి చిక్కారు. అయితే ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో ఆనంద బాలసుబ్రమణ్యం రాసిన “మురుగ ది లార్డ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విస్డమ్” అనే బుక్ కనిపిస్తోంది. అంటే దాదాపుగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయిపోయినట్లే అని ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఇక ఈ సినిమాని హరికా హాసినీ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.