ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.. బెజవాడ వన్ టౌన్ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.. అయితే, ఈ ఘటనపై విచారణ జరపాలని ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు శుక్రవారం ఫిర్యాదు చేశారు
కడెం ప్రాజెక్టు పరిస్థితి అయితే డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ప్రాజెక్టుకు ఏకంగా 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఇన్ ఫ్లో వస్తోంది. కడెం ప్రాజెక్టు అసలు సామర్థ్యం 3. 50 లక్షల క్యూసెక్కులుగా కాగా.. ప్రాజెక్టుకు ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులోని 16 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. అయితే మరో రెండు గేట్లు మాత్రం మొరాయించాయి.