Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Officers Report To Cm Chandrababu Over Conspiracy Behind Boats Crashing Into Prakasam Barrage Gates

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం.. సీఎంకు నివేదిక..

Published Date :September 9, 2024 , 10:21 am
By Sudhakar Ravula
  • ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం..
  • ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక..
  • బ్యారేజీకి బోట్లు ఢీకొన్న సంఘటనలో కుట్ర కోణం ఉందని నివేదిక..
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం.. సీఎంకు నివేదిక..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prakasam Barrage: విజయవాడను వరదల అతలాకుతలం చేశాయి.. ఓవైపు బుడమేరు.. మరోవైపు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడంతో.. విజయవాడలోని చాలా కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి.. అయితే, ఇదే సమయంలో.. కృష్ణా నదిలో బోట్లు వచ్చి.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం సంచలనంగా మారింది.. ఈ బోట్లు సృష్టించిన విధ్వంసంతో .. ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.. దీని కోసం ఆ గేట్లను కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.. ఇంకో వైపు ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీ-కొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక చేరింది.. బ్యారేజీకి బోట్లు ఢీకొన్న సంఘటనలో కుట్ర కోణం ఉందని నివేదికలో వెల్లడించారు అధికారులు..

Read Also: Manipur Violence: మణిపూర్‌లో హింసకు వ్యతిరేకంగా నిరసనకారుల ర్యాలీ.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనని ఎవ్వరూ రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమన్న నివేదికలో పేర్కొన్నారు అధికారులు.. బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు.. కార్యకర్తలవని నివేదికలో నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుల బోట్లుగా గుర్తించినట్టు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునేవారని నివేదికలో పేర్కొన్నారు.. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు తెలిపారు.. AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023, AP-IV-M-SB-0017 నెంబర్లున్న బోట్లతో పాటు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి మరో రెండు బోట్లు. ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీల బోట్లుగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందన్న నివేదికలో వెల్లడించారు.

Read Also: 16th Finance Commission: నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం..

ఇక, సహజంగా మూడు బోట్లను కలిపి కట్టరని నివేదికలో స్పష్టం చేశారు అధికారులు.. ఇనుప చైన్లతో కాకుండా.. ప్లాస్టిక్ రోప్స్‌తో బోట్లను కట్టేసినట్టు గుర్తించారు.. తాము హెచ్చరిస్తున్నా ఇనుప చైన్లతో బోట్లను కట్టలేదని స్థానికులు చెప్పారని నివేదికలో వెల్లడించారు.. తమ బోట్లతో పాటు.. సమీపంలోన మరో రెండు బోట్లు కూడా కొట్టుకెళ్లేలా ప్లాన్ చేశారని నివేదికలో చెప్పుకొచ్చారు అధికారులు. కాగా, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్ని ఘటనలో కుట్ర కోణం ఉందని ఆది నుంచి మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు.. ముఖ్యంగా మంత్రులు నిమ్మల రామనాయుడు, కొల్లు రవీంద్ర లాంటి మంత్రులు ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Boats Crashing
  • cm chandrababu
  • conspiracy
  • prakasam barrage

తాజావార్తలు

  • Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

  • Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

  • Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు

  • Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!

  • RCB Legend: “నువ్వు దేవుడు సామీ”.. 2008 నుంచి 2026 వరకు 18 ఏళ్లుగా ఒకే టీమ్‌ను నమ్ముకున్న ఏకైక ప్లేయర్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions