Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను అమ్ముకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తమ ప్రభుత్వమే ఉందంటూ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని విమర్శించారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను బరితెగించి అమ్మేస్తున్నారని మండిపడ్డారు. సమాజ హితం కోరే అనేకమంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను 66 ఏళ్లపాటు ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వాలని చూస్తున్నారని, ఇంత సుదీర్ఘ కాలానికి ప్రజల ఆస్తులను అప్పగించే అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు నాని.. అప్పటికి ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వయబులిటీ గ్యాప్ ఫండ్ (VGF) ఇస్తామని చెబుతున్నారని, మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రజల సొమ్ము అవసరమైనప్పుడు, రెండేళ్లపాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని నిలదీశారు. చంద్రబాబు హెరిటేజ్ సంపాదన నుంచి ఇస్తారా? పవన్ కల్యాణ్ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు ఇస్తారా? లేక మోడీ, అమిత్ షా, సత్యకుమార్ యాదవ్ తమ జేబుల్లో నుంచి ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని పేర్ని నాని విమర్శించారు. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించలేని ప్రభుత్వం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించుకోవచ్చని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ఇంతమంది వ్యతిరేకిస్తున్నా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ఎందుకు అంత తొందరపడుతోందని నిలదీశారు.
Also Read
- SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
- AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
- AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. మళ్లీ బెజవాడకు సీబీఐ
ఇక, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఎమ్మెల్యేల సిఫార్సులు ఉంటే తప్ప పేదలకు కనీస వైద్యం కూడా అందని పరిస్థితి నెలకొందని ఆరోపించారు పేర్ని నాని. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్, సత్యకుమార్ యాదవ్ అనారోగ్యానికి గురైతే హెలికాప్టర్లలో హైదరాబాద్‌కు వెళ్తారని, పవన్ కల్యాణ్‌కు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ముంబైకి వెళ్తారని వ్యాఖ్యానించారు. మరి పేద ప్రజలు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను గతంలో అయోగ్యుడంటూ పదవి నుంచి దించేసిన చంద్రబాబు.. ఇప్పుడు రూ.1,500 కోట్లతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. విగ్రహాల కోసం ఖర్చు చేసే డబ్బుతో మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులు, వారి అనుచరులు, బినామీలకు అప్పగించి దోచుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం చూస్తోందని, టెండర్ల దిశగా ముందుకెళ్తే ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
-
Jain Monkhood: రూ.15 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసం.. ఒకే కుటుంబంలో నలుగురి నిర్ణయం!
-
OnePlus Turbo 7 Pro 5G: 10,000mAh బ్యాటరీతో OnePlus కొత్త 5G ఫోన్.. 200MP కెమెరా, 100W ఛార్జింగ్!
-
Water Crisis: హైదరాబాద్ సిటీలో జలగండం.. అడుగంటిన భూగర్భ జలాలతో అపార్ట్మెంట్ వాసుల తిప్పలు..!
-
MS Dhoni-CSK: యజమానిగా ఎంఎస్ ధోనీ మరో కొత్త అవతారం?.. సీఎస్కేలో వాటా?
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..