16th Finance Commission: తెలంగాణ రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం పర్యటించనున్నారు. నిన్న సాయంత్రం రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్పనగారియా, ఇతర సభ్యులు చేరుకున్నారు. నేడు, రేపు రాష్ట్రంలో సంఘం చైర్మన్ అర్వింద్ పణగారియా, సభ్యులు పర్యటించనున్నారు. నేడు ఉదయం ప్రజాభవన్ లో ఆర్థిక సంఘం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ప్రజాభవన్‌లో పట్టణ స్థానికసంస్థల ప్రతినిధులు, గ్రామీణ స్థానికసంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్/సభ్యులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనుంది. ఆ తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు, సంస్థలతోపాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశం కానుంది.
Read also: Karnataka : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ, చిన్నారులతో సహా ఐదుగురు మృతి
కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంఘాన్ని కోరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయాలని.. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలి నిర్ణయించనట్లు సమాచారం. ఇవాళ రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఈ బృందానికి విందు ఇవ్వనున్నారు. రేపు ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, చీప్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులతో ఆర్థిక సంఘం భేటి కానున్నారు.
Read also: Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్.. రానా దగ్గుబాటి.. ‘కాంత’..
రేపటి షెడ్యూల్..
రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఫైనాన్స్ కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయంతో పోలిస్తే కేంద్రం రాష్ట్రాలకు చేసే కేటాయింపులను పెంచేలా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి సీఎం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన సూచించనున్నట్లు తెలిసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, 16వ ఆర్థిక సంఘం నుంచి ఆశించిన సహకారంపై రాష్ట్రంలోని ఆర్థిక, పురపాలక శాఖలు ఈ సమావేశంలో ప్రత్యేక ప్రజెంటేషన్‌ను ఇవ్వనున్నాయి.
Read also: Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సమర్పించే ఛాన్స్
అనంతరం ప్రజాభవన్‌లో అరవింద్ పనగారియా బృందానికి భట్టి విక్రమార్క విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు మీడియా సమావేశంలో అరవింద్ పనగారియా బృందం తమ పర్యటన వివరాలను ప్రకటించనుంది. మంగళవారం మధ్యాహ్నం ప్రజాభవన్‌లో మున్సిపల్ శాఖ అధికారులతో 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ్ ఝా ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. 15వ ఆర్థిక సంఘం కింద జీహెచ్‌ఎంసీకి మంజూరైన నిధుల వినియోగంపై సంస్థ అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పనితీరు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగానికి కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం తదితర అంశాలను పరిశీలిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Read also:
11వ తేదీ ఉదయం 16వ ఆర్థిక సంఘం మళ్లీ బయలుదేరుతుంది. 2025-26 నుంచి 2030-31 మధ్య కాలంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల బదిలీల విషయంలో 16వ ఆర్థిక సంఘం చేయబోయే సిఫార్సులు కీలకం కానున్నాయి. నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి సమర్పించాలి మరియు ఇది ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తుంది. ఇది రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి, దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు అదనపు నిధులను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?