‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ బీభత్సంతో కృష్ణా జిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు వర్షంలో కూడా మరమ్మతులు చేపట్టారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ ప్రాంతాల్లో భారీగా మరమ్మత్తు పనులు చేపట్టారు. జిల్లాలో సుమారు 4 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని అధికారులు…
మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖ తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో విశాఖలో వర్షం మొదలైంది. మొంథా తుఫాను బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావం పూర్తిగా తొలిగేవరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలుజారీ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో…
‘మొంథా’ తుఫాన్ వరి రైతులను నిండా ముంచేసింది. భారీ వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంటనష్టం మరింత పెరిగింది. బాపట్ల, వేమూరు, రేపల్లె, తెనాలి ప్రాంతాలలో వేల ఎకరాలలో వరి నేలవాలిపోయింది. కంకుల దశకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. కంటిన్యూగా వర్షం కురుస్తుంఢంతో పంటపై రైతులు ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ల ముందే పంట నాశనం అవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని…
Cyclone Montha: మొంథా తీవ్ర తుఫాన్ విధ్వంసంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను తొలుత ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా.. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 27, 28, 29, 30 తేదీల్లో రద్దు చేసిన పలు రైళ్లకు సంబంధించిన…
Cyclone Montha: తీరం వైపు దూసుకొస్తున్న మొంథా తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను టెన్షన్ పెడుతోంది.. మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు.. రేపు అత్యవసరమైతే తప్పా ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్న అధికారులు.. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.. మెడికల్ షాపులు,…