CM Chandrababu: విజయవాడ నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చిరు, వీధి వ్యాపారులతో ఆయన మాటామంతీ నిర్వహించారు. బీసెంట్ రోడ్డులో కాలినడకన చిరు వ్యాపారుల వద్దకు వెళ్ళిన సీఎం.. జీఎస్టీ సంస్కరణల అనంతరం వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు. జీఎస్టీ తగ్గింపుతో తగ్గిన ధరల మేరకే వస్తువులను ప్రజలకు విక్రయిస్తున్నారా అని ముఖ్యమంత్రి అడిగారు. పన్ను తగ్గింపుతో దసరా- దీపావళి పండుగలకు విక్రయాలు ఏ మేరకు పెరిగాయా లేదా అని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. బీసెంట్ రోడ్డులో దీపావళి ప్రమిదలు విక్రయిస్తున్న మహిళతో మాట్లాడారు. వారి సాధకబాధకాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.