CM Chandrababu: విజయవాడలోని ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు దంపతులు చేరుకోగానే, ఆలయ మర్యాదలతో వేద పండితులతో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీందర్, ఎంపీ కేశినేని చిన్ని, జిల్లా కలెక్టర్, దేవాలయ పాలక మండలి ఛైర్మన్, ఆలయ ఈవో, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మూల నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో ఉన్న దుర్గమ్మను సీఎం దంపతులు దర్శించుకున్నారు.
Read Also: Anakapalli : హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకొని, వ్యతిరేకంగా నినాదాలు
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్ర పటాన్ని చంద్రబాబుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. ఇక, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ ఒక పవిత్రమైన రోజు, సరస్వతి దేవి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు.. దుర్గమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించడం సంతోషంగా ఉంది.. రాష్ట్రం చల్లగా ఉండాలని, అమ్మ అనుగ్రహం మనపై ఉండాలని కోరుకున్నాను అని ఆయన పేర్కొన్నారు. కృష్ణమ్మ పరవళ్లతో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టులు అన్ని నిండుకుండలా మారాయి.. రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండి వారి సంపద పెరగాలని కోరుకున్నాను.. ఇప్పటి వరకు 8 లక్షల మంది అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Modi – Meloni: మెలోని ఆత్మకథకు మోడీ ముందుమాట..
ఇక, మరో 8 లక్షల మంది వరకు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1. 20 వేల మంది దర్శించుకున్నారు.. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది రాకుండా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నాం.. ఎంతో పవిత్రంగా ప్రసాదాలను ఇస్తున్నాం.. వీఐపీ దర్శనాలను రద్దు చేశాం.. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నాం.. సూపర్ సిక్స్ ద్వారా పేదలందరికీ లబ్ధి చేకూరుతుంది.. సూపర్ జీఎస్టీ ద్వారా ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ పెరిగాయి.. తద్వారా ప్రతి ఒక్కరూ ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు అని చంద్రబాబు అన్నారు.
Read Also: Arattai App: అదరగొడుతున్న ‘అరట్టై’ యాప్.. వాట్సప్‌తో పోరుకు సిద్ధమైన ఇండియన్ యాప్!
అయితే, ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 2027లో గోదావరి, 2028లో కృష్ణమ్మ పుష్కరాలు జరుపుకుంటున్నాం.. దుష్ట శక్తులను అంతం చేసే తల్లి దుర్గమ్మ, మేం చేసే ప్రతి పనికి మంచి చేకూర్చేలా చూడాలని అమ్మను కోరుకున్నా.. విజయవాడ ఉత్సవ్ కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం.. దసరా ఉత్సవాలు అంటే గుర్తొచ్చేలా విజయవాడ ఉత్సవాలు ఉంటాయి.. నేను చాలా సంతోషంగా ఉన్నాను.. స్ర్తీ శక్తి సూపర్ సిక్స్ లో సూపర్ హిట్, ఏ పండుగలు వచ్చినా ఎక్కువ మంది మహిళలు వస్తుండడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకు ముందు మగవారు లేకపోతే ఆడవారు బయటకొచ్చేవారు కాదు, ఇప్పుడు స్ర్తీ శక్తి ద్వారా బయటకు వస్తున్నారు.. త్వరలో ఆర్ధికంగా వారు ఎదుగుతారు.. ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసేందుకు మహిళా శక్తి పని చేస్తుందని వెల్లడించారు. టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం, ఆడ బిడ్డలకు మరింత రక్షణ కల్పిస్తాం.. రౌడీలను పసిగట్టే టెక్నాలజీ ఉంది.. తప్పుచేస్తే గల్లా పట్టుకుని తంతాం.. రోబోయే రోజుల్లో టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలియజేశారు.