సంచలం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అయేషా మీరా హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం..
బీపార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కొనసాగుతోన్న మిస్టరీ.. 17 ఏళ్ల క్రితం ఆయేషా మీరా హత్యకు గురికాగా ఇంకా నిందితులు ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది.
ఆయేషా మీరా హత్య కేసుపై సీబీఐ నివేదిక ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు జరిపింది. బాధితులుగా ఉన్న ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ తుది నివేదిక ఇవ్వాలని ఆయేషా మీరా తల్లిదండ్రుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టులో ఉన్న నివేదికను తీసుకోవచ్చు కదా అని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పటి వరకు 18 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరిగారని మళ్ళీ నివేదిక కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్తితి వస్తోందని పిటిషనర్…
సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది.. దీంతో, తుది నివేదికను సీల్డ్ కవర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి..
ఆయేషా మీరా తల్లి సీజేఐ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేదని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ఎందుకు ఆపివేసారో తెలియడం లేదన్నారు. నేరస్థులు ఎవరో తెలిసినా దర్యాప్తు సంస్ధలు పట్టుకోలేని స్ధితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలో న్యాయం జరగదని మీరు ఆమోదముద్ర వేస్తే మూగజీవాలుగా మిగిలిపోతామని లేఖలో అయేషా మీరా తల్లి పేర్కొన్నారు. ఇదిలా వుండగా… సీజేఐ జస్టిస్ ఎన్వీ…
ఆయేషా మీరా హత్యకేసు దేశాన్ని మొత్తం గజగజలాడించిన విషయం తెలిసిందే. నిందితుడు సత్యంబాబుకు తొమ్మిదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు అతడిని ఇటీవలే విడుదల చేసింది. అయితే జైలు నుంచి బయటకి వచ్చాక సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, దానికి నష్టపరిహారంగా రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాజాగా ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు హాజరైన సత్యంబాబు మాట్లాడుతూ ” హత్య కేసులో…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్ట్‌లు నిర్వహించాలని.. అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ.. అయితే, నిందితుల తరపున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించాడు.. ఇరు పక్షాల వాదనలు విన్న విజయవాడ కోర్టు..…