Big twist in Vallabhaneni Vamsi case..వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ నెల 11వ తేదీన వల్లభనేని వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై FIR రిజిస్టర్ చేశారు పోలీసులు.. 84/2025 కేసులో ఏ5గా ఉన్నారు సత్యవర్థన్.. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్ధన్ లపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.. 232, 351 (3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పటమట పోలీసులు..
Read Also: TG High Court: విషాదం.. కేసు వాదిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన న్యాయవాది
అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్.. తాజాగా వల్లభనేని వంశీ మోహన్ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని
కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు.. వంశీ బ్యాచ్ 5 లక్షలు కేసు వాపస్ తీసుకుంటే ఇస్తానని తమకు చెప్పారని.. టీడీపీ వాళ్లతో మాట్లాడి అంతకంటే ఎక్కువ ఇప్పించాలని తమను కోరినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు రమాదేవి.. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్థన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు.. వల్లభనేని వంశీ మోహన్ అతని అనుచరులు డబ్బులకు ప్రలోభ పెట్టి చంపుతామని సత్యవర్ధన్ ను బెదిరించారని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు రమాదేవి.. ఇక, ఆమె ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్ధన్ లపై కేసు నమోదు చేశారు పటమట పోలీసులు..