Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Ramdev Visits Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాందేవ్ బాబాకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో.. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సదర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. జగన్మాత దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం తనకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న రాందేవ్ బాబా.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు స్వయంభువుగా వెలిశారని, అమరావతి సమీపంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మహా శక్తి పీఠం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా రాందేవ్ బాబా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని.. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతి దేవతల రాజధానిగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.. ఇక, విద్య, వ్యవసాయం సహా పలు రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు రాందేవ్ బాబా.. ఇక, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఉండవల్లి గుహల్లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత వినూత్న, సృజనాత్మక, దూరదృష్టి కలిగిన మరియు అమలు సామర్థ్యం ఉన్న నాయకుడని బాబా రాందేవ్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రత్యేక దృష్టి ఆయనకు ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధిని సాధించాలనే ఆలోచనతో పనిచేస్తున్నారని రాందేవ్ తెలిపారు. సంపద సృష్టితో పాటు ఆధ్యాత్మిక విలువలను కూడా సమానంగా ప్రోత్సహించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యాన్ని ప్రస్తావించిన బాబా రాందేవ్, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడిలా అంకితభావం, నిజాయితీ, పట్టుదలతో పనిచేస్తే 2047 కంటే ముందే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!